తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఐశ్వర్యా రాయ్ ప్రెగ్నెన్సీతో ఉందా? - Aishwarya Rai ponniyan selvan leaked

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ బీటౌన్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత? ఐశ్వర్య ఏం అంటోంది?

Aishwarya Rai
ఐశ్వర్యా రాయ్

By

Published : Aug 24, 2021, 3:39 PM IST

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ మధ్యప్రదేశ్​లో జరిగింది. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ ముగించుకుని ముంబయి చేరుకుంది. ఈ సమయంలోనే ఎయిర్​పోర్ట్​ దగ్గర ఆమె ఫొటోలు, వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆమెను చూసిన కొందరు ఐష్ మళ్లీ ప్రెగ్నెన్సీతో ఉందంటూ పోస్టులు, కామెంట్లు చేయడం వల్ల వైరల్​గా మారింది. అయితే ఈ విషయంలో ఐశ్వర్యతో పాటు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు.

ఐశ్వర్యా రాయ్

'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో ఐశ్వర్య విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలూ, వీడియోలూ నెట్టింట వైరల్​గా మారాయి. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన డైరెక్షన్​లో తెరకెక్కి 1997లో విడుదలైన 'ఇరువర్' సినిమాతోనే ఐష్ తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత 'గురు', 'రావణ్'​ చిత్రాలతో ఈ కాంబో ప్రేక్షకుల్ని పలకరించింది.

'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యతో పాటు విక్రమ్, కార్తి, త్రిష, ప్రకాశ్ రాజ్, జయరామ్, జయం రవి తదితరులు నటిస్తున్నారు.

ఇవీ చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న.. సీ'రియల్' కపుల్​!

ABOUT THE AUTHOR

...view details