నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన రోజుల్లో మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. 23 ఏళ్ల క్రితం చిత్రీకరణ జరుపుకొన్న 'రాధేశ్యామ్ సీతారామ్' సినిమాలో సునీల్‌శెట్టి హీరోగా ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా విడుదల కాలేదు.
ఆ సినిమా చిత్రీకరణలో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఐశ్వర్య అందులో లెహంగాతో దర్శనమిచ్చింది. దానికి సరిపోయే ఆభరణాలు ధరించి ఉంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.