తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చెడ్డ పాత్రల్లో నటించలేనన్న నీలికళ్ల సుందరి - అమలాపాల్

విలన్​ లక్షణాలున్న పాత్రల్లో నటించలేనని చెప్పింది హీరోయిన్​ ఐశ్వర్యరాయ్. అయితే త్వరలో ప్రారంభమయ్యే 'పొన్నియన్ సెల్వన్'​లో మాత్రం ఇలాంటి రోల్​లోనే కనిపించనుంది. ఇది ఒప్పుకోవడానికి గల కారణాలను వివరించింది.​

చెడ్డ పాత్రల్లో నటించలేనన్న నీలికళ్ల సుందరి

By

Published : Aug 1, 2019, 5:01 AM IST

ఐశ్వర్యరాయ్‌.. ఈ పేరు వినగానే నీలి కళ్లతో అందమైన రూపం గుర్తొస్తుంది. అలాంటి ఈ భామ ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటించడం తనకే కాకుండా కూతురు ఆరాధ్యకూ ఇష్టం లేదని చెప్పింది. కానీ దర్శకుడు మణిరత్నం తీస్తున్న 'పొన్నియన్ సెల్వన్'లో ఇలాంటి పాత్రలోనే కనిపించనుంది. ఈ విషయంపై స్పందించింది విశ్వసుందరి.

ఐశ్యర్యరాయ్-మణిరత్నం

"నేను ఇప్పటి వరకు మణిరత్నం సినిమాల్లో పూర్తి గ్లామర్‌ పాత్రలే చేశాను. బాలీవుడ్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ తర్వాత గౌరవించే దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఇలాంటి పాత్ర చేస్తే మా అమ్మాయి ఆరాధ్య నన్ను చెడ్డ అమ్మ అనుకుంటుందని ఆయనకు చెప్పా. కానీ ఈ రోల్ నేనెందుకు చేయాలి అనేది నాకు పూర్తిగా పూసగుచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా మీ అమ్మాయికి నటన గురించి తెలిసే వయసులో నిన్ను చూసి గర్వపడుతుందని అన్నారు." -ఐశ్వర్యరాయ్, హీరోయిన్

ఈ దర్శకుడితో ఇప్పటికే 'ఇద్దరు', 'గురు', 'రావణ్‌'లో నటించింది ఐశ్వర్య. ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్'​లో ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి హీరోలుగా కనిపించనున్నారు. అమలాపాల్, కీర్తి సురేశ్, విజయ్ సేతుపతి ఇతర పాత్రల్లో నటించనున్నారని సమాచారం. డిసెంబరు నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇది చదవండి: 'టామ్​ అండ్ జెర్రీ'లో భారతీయ నటికి అవకాశం

ABOUT THE AUTHOR

...view details