బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ బచ్చన్ తాజా ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్‌పేజీ కోసం ఇచ్చిన ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆమె ... నిచ్చెన పట్టుకొని ఫోజులిచ్చింది. న్యూయర్క్ వీధుల్లో ఈ ఫొటోషూట్ జరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
2018లో విడుదలైన 'ఫన్నేఖాన్' చిత్రంతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అమ్మడు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న 'పొన్నియన్ సెల్వన్' ప్రాజెక్టుతో బిజీగా ఉంది. మల్టీస్టారర్‌గా రానున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, విజయ్ దళపతి నటిస్తున్నారు.