ఫ్రాన్స్‌లో 'పారిస్ ఫ్యాషన్ వీక్'(Paris Fashion Week 2021) అట్టహాసంగా జరుగుతోంది. విభిన్న దుస్తులు ధరించిన పలువురు సెలబ్రిటీలు.. ఐఫిల్ టవర్ వద్ద ర్యాంప్‌పై నడిచి మత్తెక్కించారు. ఇందులో(Paris Fashion Week 2021) పాల్గొన్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్.. తన అందంతో చూపరులను కట్టిపడేసింది.
ర్యాంప్‌పై నడుస్తున్న ఐశ్వర్యా రాయ్ తెల్లని వస్త్రాల్లో ఐశ్వర్యా రాయ్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య కుటుంబం సంప్రదాయ దుస్తులను తలపించేలా తెల్ల రంగు వస్త్రాలను ధరించిన ఐశ్.. ర్యాంప్‌పై హొయలుపోతూ కనిపించింది. పెదాలకు అద్దుకున్న గులాబీ రంగు లిప్‌స్టిక్.. ఆమె అందాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు. లోరియల్ సంస్థ 2022 వేసవి కోసం రూపొందించిన ప్రత్యేక దుస్తులను ఐశ్వర్య ధరించింది.
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు హాలీవుడ్ సెలబ్రిటిలతో ఐశ్వర్య నవ్వులు చిందిస్తున్న ఐశ్వర్యరాయ్ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో సెలబ్రిటీలు ఫొటోలు వైరల్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులు "#AishwaryaInParis" అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. సింగర్ క్యామిలా క్యాబెలో, నటి కేథరిన్ లాంగ్ఫోర్డ్తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటితో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలతో ఐశ్వర్యా రాయ్ కలిసి ఉన్న ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఐఫిల్ టవర్ వద్ద అదిరే స్టంట్- సన్నటి తాడుపై నడుస్తూ..