తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి మణిరత్నం చిత్రంలో ఐశ్వర్య - విక్రమ్

'రోబో' తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించని మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్.. మణిరత్నం సినిమాలో నటించబోతున్నట్లు చెప్పింది. తన పాత్ర పవర్​ఫుల్​గా ఉంటుందని పేర్కొంది.

'అవును.. ఆ సినిమాలో నటిస్తున్నా'

By

Published : May 26, 2019, 7:30 AM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారనే వార్త గత కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతోంది. కానీ ఆ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంత వరకు రాలేదు. నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్ ఇటీవలే ఈ విషయం పై స్పందించింది.

కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్ లో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లిన ఐశ్వర్యారాయ్.. అక్కడి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మణిరత్నం సినిమాలో నటించబోతున్నట్లు చెప్పింది. వైవిధ్యంగా ఉండే నందిని అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. షూటింగ్​ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్

ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్​తో పాటు విక్రమ్, కార్తీ, కీర్తి సురేశ్​తో పాటు కొందరు ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ఓ ప్రముఖ నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు.

ఇది చదవండి: నాతో ఎంజాయ్​మెంట్ మాములుగా ఉండదంటున్న హీరోయిన్ సమంత

ABOUT THE AUTHOR

...view details