తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు: ఐశ్వర్య - amithab bachchan

తమ కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు నటి ఐశ్వర్యారాయ్. కుమార్తెతో పాటు ఈమె డిశ్చార్జ్​ అయ్యారు. అమితాబ్, అభిషేక్​.. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Aishwarya 'forever indebted' to fans for praying for her family's recovery from COVID-19
'మా కోసం ప్రార్థనలు చేసిన వారికి ధన్యావాదాలు'

By

Published : Jul 29, 2020, 3:45 PM IST

Updated : Jul 29, 2020, 5:07 PM IST

కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్​ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు​. మహమ్మారి బారినుంచి తన కుటుంబం కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఐశ్వర్య.

"నేను, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని కోరున్న వారందరీకి ధన్యవాదాలు. మీరు మా కోసం చేసిన ప్రార్థనలు, మాకు ఏమవుతుందో అని ఆందోళన చెందిన వారికి రుణపడి ఉంటాను" అని ఇన్​స్టా​లో పంచుకుంది ఐశ్వర్య.

కొవిడ్​ పాజిటివ్​గా తేలిన తర్వాత ఐశ్వర్యారాయ్​, ఆమె భర్త అభిషేక్​, కుమార్తె ఆరాధ్య, బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​లు.. జులై 11న ముంబయిలో నానావతి ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే చేసిన పరీక్షల్లో ఐశ్వర్య, ఆరాధ్యకు నెగిటివ్​ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తల్లికుమార్తె సోమవారం డిశ్చార్జ్​ అయ్యారు.

అమితాబ్​​, అభిషేక్​ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ విషయాన్ని అభిషేక్ వెల్లడించాడు. "నాన్న, నేను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాం. మేం కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని రాసుకొచ్చారు. . ​

Last Updated : Jul 29, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details