తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema News: టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న రజనీకాంత్‌ కుమార్తె - టాలీవుడ్​లోకి రజనీకాంత్‌ కుమార్తె

సూపర్​స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది. లైకా ప్రొడక్షన్స్‌ తెరకెక్కించనున్న ఓ సరికొత్త తెలుగు చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారు.

aishwarya danush latest news
టాలీవుడ్​లోకి రజనీకాంత్‌ కుమార్తె

By

Published : Oct 2, 2021, 7:16 PM IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కుమార్తె, నటుడు ధనుష్‌ సతీమణి ఐశ్వర్య తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. లైకా ప్రొడెక్షన్స్‌ తెరకెక్కించనున్న ఓ సరికొత్త తెలుగు చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఆ సంస్థ 'రామ్‌సేతు', 'గుడ్‌లక్‌ జర్రీ' సినిమాలను నిర్మిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

'లైకా' ప్రొడెక్షన్స్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్య చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మీ ముందుకు తీసుకురానున్నామని అన్నారు. మరోవైపు ఐశ్వర్య ఇప్పటికే '3'తో దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టేశారు.

ఇదీ చదవండి:'ఇదే మా కథ' ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా?

ABOUT THE AUTHOR

...view details