తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"ఇంటర్నెట్​లో కాంట్రవర్షియల్ కంటెంట్​నే ప్రేక్షకులు చూస్తారు" - నయనతార

నయనతార నటించిన 'ఐరా' సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. తొలిసారి నయనతార ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

"కాంట్రవర్షియల్ కంటెంట్​నే ప్రేక్షకులు చూస్తారు"

By

Published : Mar 21, 2019, 6:36 AM IST

హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్న నయనతార త్వరలో మరో సినిమాతో అలరించనుంది. ఆమె నటించిన తాజా చిత్రం 'ఐరా' తెలుగు ప్రచారచిత్రం బుధవారం విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద్విపాత్రల్లో నయన్​ 'ఐరా' చిత్ర పోస్టర్​
  • నయన్ తొలిసారిగా రెండు పాత్రల్లో నటించింది. "ఇప్పుడున్న ఇంటర్నెట్ తరంలో వివాదాస్పద అంశాలనే ప్రేక్షకులు చూస్తారు" అనే సంభాషణలతో ఉత్కంఠగా ట్రైలర్ రూపొందించారు.​ తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువాదం చేశారు.

ఈ ఏడాది 'విశ్వాసం', 'అంజలి సీబీఐ' లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ఈ అందాల భామ. ఇప్పుడు 'ఐరా' చిత్రంతో భయపెట్టేందుకు రెడీ అవుతోందీ కేరళకుట్టి. సార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోటపాడి రాజేశ్ నిర్మించారు.


ABOUT THE AUTHOR

...view details