తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ ఫోరెన్సిక్ రిపోర్టుపై ఎయిమ్స్ ఛైర్మన్ ఏమన్నారంటే? - సుశాంత్ రాజ్​పుత్ ఫోరెన్సిక్ రిపోర్టు

సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో అతడి శవపరీక్షపై అధ్యయనం చేస్తోంది ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం. అయితే ఈ కేసు విషయంలో తుది ఫలితాలు వెల్లడించడానికి ముందు కొన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఎయిమ్స్ ఛైర్మన్ డా.సుదీర్ గుప్తా వెల్లడించారు.

AIIMS forensic chief on report in Sushant Singh Rajput's death
సుశాంత్ ఫోరెన్సిక్ రిపోర్టుపై ఎయిమ్స్ ఛైర్మన్ ఏమన్నారంటే?

By

Published : Sep 29, 2020, 12:16 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) రిపోర్టును సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో ఓ స్పష్టతకు రావడానికి న్యాయపరమైన అంశాల గురించి కూడా ఆలోచించి వస్తుందని ఎయిమ్స్ ఛైర్మన్ డా. సుధీర్ గుప్తా వెల్లడించారు.

"ఎయిమ్స్, సీబీఐ.. సుశాంత్ కేసు విషయంలో ఓ ఒప్పందంలో ఉన్నాయి. ఈ కేసుపై తుది ఫలితాలు వెల్లడించే ముందు కొన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది."

-సుదీర్ గుప్తా, ఎయిమ్స్ ఛైర్మన్

సెప్టెంబర్ 7న సుశాంత్ శరీరంలో విషం ఉందనే అనుమానంతో పరీక్షలు నిర్వహించారు ఎయిమ్స్ వైద్యులు. ఈ కేసు విషయంలో మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు ముగ్గురు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్యులతో టీమ్ ఏర్పాటుచేసింది సీబీఐ.

ప్రస్తుతం ఈ కేసు విషయంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్​తో సంబంధాలున్నాయన్న అనుమానంతో వీరిని ఎన్​సీబీ అధికారులు విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details