తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇప్పుడు ఫస్ట్​లుక్.. రేపు ట్రైలర్.. నెలలో సినిమా - farhan akthar

బాలీవుడ్​ సినిమా 'ద స్కై ఈజ్ పింక్' ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇటీవలే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శితమైన ఈ చిత్రం వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద స్కై ఈజ్​ పింక్ చిత్రబృందం

By

Published : Sep 9, 2019, 1:28 PM IST

Updated : Sep 29, 2019, 11:46 PM IST

ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'ద స్కై ఈజ్ పింక్'. ఫర్హాన్​ అక్తర్, జైరా వాసీం, రోహిత్ సరాఫ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది ప్రియాంక. మంగళవారం ట్రైలర్​ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ద స్కై ఈజ్ పింక్ సినిమా ఫస్ట్​లుక్ పోస్టర్

దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్​లో సినిమా చేస్తోంది ప్రియాంక. విడుదలకు ముందే ప్రస్తుతం జరుగుతోన్న టొరంటో చిత్రోత్సవం(టిఐఎఫ్ఎఫ్)లో ఈనెల 13న ప్రదర్శితం కానుందీ చిత్రం. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమవనుంది. సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'ఫృథ్వీరాజ్'​ చౌహాన్​గా బాలీవుడ్​ సూపర్​స్టార్​

Last Updated : Sep 29, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details