తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సైరా' థియేటర్​ వద్ద బాంబు పేలుడు - TAMILANADU CRIME NEWS

చెన్నైలో బాంబు దాడి కలకలం రేపింది. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, భారత ప్రధాని మోదీ అనధికార సమావేశానికి సరిగ్గా ఒక రోజు ముందు స్థానిక కాసినో థియేటర్​ వద్ద పేలుడుకు పాల్పడ్డారు దుండగులు. ప్రముఖ రౌడీషీటర్​ తొట్టమ్​ శేఖర్​ మూడో భార్యపై కత్తితో దాడి చేసి గాయపరిచారు.

'సైరా' థియేటర్​ వద్ద బాంబు పేలుడు

By

Published : Oct 10, 2019, 3:55 PM IST

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ కీలక సమావేశానికి ముందు తమిళనాడులోని చెన్నైలో బాంబు దాడి కలకలం సృష్టించింది. వీరి భేటీ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ.. స్థానిక కాసినో థియేటర్​ వద్ద కొందరు దుండగులు పేలుడుకు పాల్పడ్డారు. ఇక్కడ మెగాస్టార్​ చిరంజీవి నటించిన సైరా చిత్రం ప్రదర్శితమవుతోంది.

నాటు బాంబు పేల్చిన అనంతరం ఓ మహిళపై కత్తితో దాడి చేశారు. బాధితురాలిని ప్రముఖ రౌడీషీటర్​ తొట్టమ్​ శేఖర్​ మూడో భార్యగా నిర్ధరించారు పోలీసులు. ఆరుగురు సభ్యుల ముఠా ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణాలను ఆరా తీస్తున్నారు.

అక్టోబర్​ 11-12 తేదీల్లో భారత్​, చైనా దేశాధినేతల మధ్య రెండో అనధికార సమావేశం తమిళనాడు వేదికగా జరగనుంది.

'సైరా' థియేటర్​ వద్ద నాటు బాంబు పేలుడు

ABOUT THE AUTHOR

...view details