తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అంధాధున్' రీమేక్ వివాదంపై స్పందించిన అహానా - అహానా కృష్ణ అంధాధున్ రీమేక్ వివాదం

బాలీవుడ్​లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'అంధాధున్'​ చిత్రాన్ని మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ హీరోగా నటిస్తుండగా, అహానా కృష్ణ హీరోయిన్​గా చేస్తుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి అహానాను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిందీ నటి.

Ahaana Krishna
అహానా

By

Published : Mar 12, 2021, 10:26 AM IST

Updated : Mar 12, 2021, 12:10 PM IST

ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'అంధాధున్‌'. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ టాక్‌ అందుకుంది. ఈ క్రమంలోనే 'అంధాధున్‌' చిత్రాన్ని త్వరలో మలయాళంలోకి రీమేక్ చేయనున్నారు. పృథ్వీరాజ్‌ హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. అహానా కృష్ణ ఇందులో నటించనున్నారంటూ చిత్రబృందం ఓ సమయంలో అధికారికంగా ప్రకటించింది. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అలాగే ఆమెను తొలగించడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పుకొచ్చింది.

అహానా కృష్ణ

'అంధాధున్‌' రీమేక్‌ కాంట్రవర్సీ గురించి తాజాగా నటి అహనా స్పందించారు. "ఈ వార్తల నుంచి నన్ను దూరంగా ఉంచండి. ఇకపై నేను ఆ సినిమాలో భాగం కాదు. ఈ విషయమై నేను ఎవర్నీ నిందించాలనుకోవడం లేదు. నా గురించి ఎవరు ఏమనుకున్నా అది వాళ్ల అభిప్రాయానికే వదిలేస్తా. ఈ డ్రామా వల్ల నాకు వచ్చేది ఏం లేదు."

-అహానా కృష్ణ, నటి

కాగా, రాజకీయ కారణాల వల్ల తన కుమార్తె అహానాను 'అంధాధున్‌' రీమేక్‌ నుంచి తొలగించారని హీరోయిన్‌ తండ్రి కృష్ణకుమార్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తాను భాజపాలోకి చేరడం వల్లనే తన కుమార్తెను సినిమా నుంచి తొలగించారని ఆయన ఆరోపణలు చేశారు. కాగా, కృష్ణకుమార్‌ చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ చిత్రబృందం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Last Updated : Mar 12, 2021, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details