మహా శివరాత్రి పురస్కరించుకొని మార్చి 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంది 'గాలి సంపత్' సినిమా. అయితే రిలీజైన వారానికే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. 'ఆహాలో మార్చి 19 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో పాటు అదే రోజు 'క్షణక్షణం' కూడా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఉదయ్ శంకర్, జియా శర్మ ఇందులో హీరోహీరోయిన్లుగా నటించారు.
ఓటీటీ విడుదలకు మూడు సినిమాలు రెడీ - జాంబీరెడ్డి ఓటీటీ రిలీజ్
ఇటీవలే వెండితెరపై విడుదలపై ప్రేక్షకుల్ని అలరించిన 'జాంబీరెడ్డి', 'గాలి సంపత్', 'క్షణక్షణం' సినిమా.. ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ మూడింటి హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' సొంతం చేసుకుంది.
ఓటీటీ విడుదలకు సిద్ధమైన 'గాలి సంపత్', 'జాంబీరెడ్డి'
జాంబీలను తెలుగుతెరకు పరిచయం చేసిన చిత్రం 'జాంబీరెడ్డి'. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు 'ఆహా'లో మార్చి 26 నుంచి చిన్నతెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా, ప్రశాంత్‌వర్మ దర్శకుడు.
Last Updated : Mar 18, 2021, 5:15 PM IST