తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సేతుపతి-నిహారిక సినిమా.. మూడేళ్ల తర్వాత తెలుగులోకి - movie news

మెగా డాటర్ నిహారిక నటించిన తమిళ సినిమాను, దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకురానున్నారు. ఫస్ట్​లుక్​ను విడుదల చేసిన చిత్రబృందం.. విడుదల తేదీని కూడా వెల్లడించింది.

after three years, vijay sethupathi-niharika movie into telugu
విజయ్ సేతుపతి నిహారిక

By

Published : Feb 26, 2021, 4:56 PM IST

Updated : Feb 26, 2021, 6:14 PM IST

నటి నిహారిక కొణిదెల కథానాయికగా నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్'. ఆరుముగ కుమార్‌ దర్శకుడు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. 2018లో విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రాన్ని.. మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 'ఓ మంచి రోజు చూసి చెప్తా' టైటిల్​తో అనువదిస్తున్నారు.

ఓ మంచి రోజు చూసి చెప్తా సినిమాలో విజయ్ సేతుపతి-నిహారిక

మార్చి 19న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. అపోల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేయనున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్ స్వరాలు అందించారు.

Last Updated : Feb 26, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details