డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. త్వరలో కరణ్ సమన్లు జారీ చేసే అవకాశముంది. అకాళీదల్ నేత మజీందర్ సింగ్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్సీబీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
గతంలో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, విక్కీ కౌశల్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్లు పాల్గొని డ్రగ్స్ సేవించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మజీందర్. అయితే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారిన అనంతరం కరణ్ ఈ పార్టీపై వివరణ ఇచ్చారు. ఏ నటీనటులు, ఎలాంటి మాదక ద్రవ్యాలు సేవించలేదని స్పష్టం చేశారు.