బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి.. రోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతర్జాతీయ మీడియాలోనూ ఈమె గురించి కథనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్, డాక్యూమెంటరీ తీయాలని దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారట. నటి జీవితం ఆధారంగా ఓ పుస్తకాన్ని తీసుకురావాలని ఓ ప్రచురణ సంస్థ ప్రయత్నం చేస్తుందట.
సుశాంత్ సింగ్తో పాటు రియా చక్రవర్తి బయోపిక్! - rhea biopic
సుశాంత్ కేసులో భాగంగా రిమాండ్లో ఉన్న హీరోయిన్ రియా చక్రవర్తి బయోపిక్ తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.
రియా బయోపిక్
ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసులో దోషిగా తేలి జైలులో ఉన్నారు రియా, ఆమె సోదరుడు షోవిక్. వీరి బెయిల్ దరఖాస్తుపై సెప్టెంబర్ 29న బాంబే హైకోర్టు విచారణ జరపనుంది. ఈమెతో పాటు ప్రముఖ కథానాయికలు రకుల్, దీపిక పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది.
ఇదీ చూడండి 'ఒరేయ్ బుజ్జిగా' ట్రైలర్: అక్కడ మా బావ.. ఇక్కడ వీడు