తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంటర్ కాలేజీల మెరిట్ జాబితాల్లో పోర్న్​స్టార్స్ - pornstars college latest news

కొందరు పోర్న్​స్టార్స్ పేర్లు.. ఇంటర్ కాలేజీ మెరిట్​ జాబితాల్లో కనిపించాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారు.

After Sunny Leone, pornstars figure in Bengal college merit list
నటి సన్నీ లియోనీ

By

Published : Aug 29, 2020, 9:49 PM IST

ఇంటర్నెట్​లో ఉండాల్సిన పోర్న్​స్టార్స్​.. పశ్చిమ బంగాల్​లోని ఇంటర్​ కాలేజీల మెరిట్​ జాబితాల్లో దర్శనమిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేస్తున్నారని సదరు కళాశాల యాజమాన్యాలు తెలిపాయి.

కాలేజీ టాపర్ సన్నీ లియోనీ

కోల్​కతాలోని అషుతోష్ కళాశాల, తమకు సంబంధించిన 12వ తరగతి మెరిట్​ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. అగ్రస్థానాన్ని నటి సన్నీ లియోనీ కైవసం చేసుకున్నట్లు కనిపించింది. పేరుతో పాటు రోల్ నంబర్, మార్కులు కూడా ఉండటం వల్ల నెటిజన్లు దీనిని బాగా ట్రోల్ చేస్తున్నారు. దీని గురించి ట్వీట్ చేసిన సన్నీ.. వచ్చే సెమిస్టర్​ నుంచి క్లాస్​లకు కూడా వస్తానని కామెంట్ చేసింది. దీనితో పాటే బడ్జ్ బడ్జ్​ కాలేజీ మెరిట్​ జాబితాలోనూ సన్నీ పేరు కనిపించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు.

అషుతోష్ కాలేజీ మెరిట్​ లిస్ట్​లో సన్నీలియోనీ పేరు

టాప్-4లో ప్రముఖ పోర్న్​స్టార్స్

పశ్చిమ బంగాల్​లోని బర్సాత్ ప్రభుత్వ కళాశాలలో అయితే ఏకంగా నలుగురు ప్రముఖ పోర్న్​స్టార్స్, టాప్​-4 ర్యాంక్​ల్లో ఉండటం యాజమాన్యాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఈ జాబితాలో డేనీ డేనియల్స్, మియా ఖలీఫా, సన్నీ లియోనీ, జానీ సిన్స్ వరుస స్థానాల్లో ఉన్నారు.

ఈ మూడు కాలేజీ మేనేజ్​మెంట్స్ కూడా ఈ విషయమై ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు కావాలనే తమ కళాశాల పేరు చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారని బర్సాత్ కాలేజీ విద్యార్థి కౌశిక్ కర్మాకర్ చెప్పారు.

బర్సాత్ కాలేజీ యాజమాన్యం పోలీస్ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details