టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో మహేశ్ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పైడర్' చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.
మహేశ్-మురుగదాస్ కాంబినేషన్లో మరో చిత్రం! - ar murugadoss news
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ దర్శకుడి చిత్రానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'సర్కారు వారి పాట' చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట.
మహేశ్-మురుగదాస్ కాంబినేషన్లో మరో చిత్రం!
మహేశ్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా హీరో విజయ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహేశ్-మురుగదాస్ కాంబినేషన్లో రానున్న చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.