హీరో రణ్‌బీర్ కపూర్‌కు కరోనా సోకిన కొద్దిసేపట్లోనే మరో వార్త బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారినపడ్డారనేది దీని సారాంశం. ప్రస్తుతం ఆయన తన ఆఫీస్‌లోనే క్వారంటైన్లో ఉన్నారు. కాగా, ప్రస్తుతం భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్ కతియావాడి' చిత్రం చేస్తోన్న రణ్‌బీర్ ప్రేయసి ఆలియా భట్ టెస్టు ఫలితం ఇంకా వెల్లడికాలేదు.
బాలీవుడ్లో మరొకరికి కరోనా.. ఈసారి ప్రముఖ దర్శకుడు! - రణ్‌బీర్ కపూర్ కరోనా పాజిటివ్
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. ప్రస్తుతం తన ఆఫీస్‌లో క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా, భన్సాలీ దర్శకత్వంలో' గంగూబాయ్ కతియావాడి' చిత్రం చేస్తోన్న ఆలియా భట్ కరోనా ఫలితం ఇంకా రాలేదు.
![బాలీవుడ్లో మరొకరికి కరోనా.. ఈసారి ప్రముఖ దర్శకుడు! After Ranbir, now SLB tests COVID-19 positive; Alia's test results awaited](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10932706-1077-10932706-1615275774855.jpg)
భన్సాలీ, ఆలియా
హుస్సేన్ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి'లోని 'మేడమ్ ఆఫ్ కామతిపుర' ఆధారంగా 'గంగూబాయ్' తెరకెక్కుతోంది. కామతిపుర దేశంలోనే రెండో రెడ్ లైట్ ఏరియాగా పేరు గాంచింది!. ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.