లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న వారికోసం ఇప్పటికే 'రామాయణం', 'మహాభారతం' వంటి ధారావాహికల్ని దూరదర్శన్‌లో మళ్లీ ప్రసారం చేస్తున్నారు. వీటికి వీక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. మిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఈ క్రమంలోనే మరో సీరియల్ 'శ్రీ కృష్ణ'ను పునఃప్రసారం చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు.
'రామాయణం', 'మహాభారతం' బాటలో మరో సీరియల్ - lockdown seriels on dooradarshan
అద్భుత ధారావాహిక 'శ్రీ కృష్ణ'ను దూరదర్శన్ ఛానెల్లో మరోసారి ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా వెల్లడించారు.
!['రామాయణం', 'మహాభారతం' బాటలో మరో సీరియల్ 'రామాయణం', 'మహాభారతం' బాటలో మరో సీరియల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6946580-465-6946580-1587885592296.jpg)
శ్రీ కృష్ణ సీరియల్
ఈ ధారావాహికను శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా తెరకెక్కించారు. రమానంద్ సాగర్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ సీరియల్‌ను తొలిసారి 1993లో ప్రసారం చేశారు. ఇందులో సర్వదమన్ బెనర్జీ.. కృష్ణుని పాత్రలో కనిపించగా, స్వప్నిల్ జోషి.. చిన్ని కృష్ణయ్యగా కనువిందు చేశారు. వీరితో పాటే దీపక్ దుల్కర్, పింకీ పరీఖ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.