తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముంబయికి వస్తున్నా.. వీలైతే ఆపుకోండి' - కంగన సినిమా వార్తలు

మహారాష్ట్ర హోంమంత్రి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్​ చేసింది బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​. ముంబయిని తాలిబన్​తో పోల్చింది.

kangana
కంగనా రనౌత్​

By

Published : Sep 4, 2020, 8:29 PM IST

బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​కు ముంబయిలో నివసించే హక్కు లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ అన్నారు. దీనిపై ట్విట్టర్​ వేదికగా స్పందించిన కంగన.. మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ముంబయిని తాలిబన్​తో పోల్చింది. ఈ క్రమంలోనే అనిల్​​ తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన లింక్​ను పోస్ట్​ చేసింది.

"'కంగనకు ముంబయిలో ఉండే హక్కు లేదు. ఆమె నగరంలో ఎప్పటికీ అడుగుపెట్టలేదు. పాల్ఘర్​ సాధువులను ఎలా చంపామో... తననూ అలాగే రాళ్లు, రాడ్లతో కొడతాం' అని అనిల్ అన్నారు. అసలు ఒక్కరోజులో పీఓకే నుంచి తాలిబన్​ స్థాయికి ఎలా ఎదిగిపోయారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను ముంబయికి తిరిగి రాకూడదని చాలా మంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందువల్ల సెప్టెంబర్ 9న ముంబయికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. నేను ముంబయి విమానాశ్రయంలో దిగే సమయాన్ని కూడా చెబుతా. మీకు వీలైతే నన్ను ఆపుకోండి."

-కంగనా రనౌత్​, సినీ నటి


తనను మహారాష్ట్రలో అడుగుపెట్టొద్దని చెప్పేందుకు మీరెవరంటూ ట్విట్టర్​లో విరుచుకుపడింది కంగన. తనకన్నా.. మహారాష్ట్రను ఎక్కువగా ఎవరు ప్రేమించగలరని పేర్కొంది. ఇప్పుడు అక్కడ అడుగుపెట్టేందుకు హక్కు లేదా?. అంటూ ప్రశ్నించింది.

ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉంది కంగన. లాక్​డౌన్​ నేపథ్యంలో కుటుంబంతో కలిసి గడుపుతోంది.

ABOUT THE AUTHOR

...view details