తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆలియా కంటే మంచి హీరోయిన్లు ఉన్నారు' - Kangana Ranauts snub at Filmfare Rangoli Chandel unleashes

కంగనా రనౌత్ సోదరి రంగోలీ ట్విట్టర్ వేదికగా ఫిలింఫేర్ అవార్డులపై ధ్వజమెత్తింది. ఆలియా భట్, అనన్య పాండేలకు అవార్డులు రావడంపై మండిపడింది. వారికంటే ఉత్తమ నటులు ఇండస్ట్రీలో ఉన్నారంటూ తెలిపింది.

రంగోలీ
రంగోలీ

By

Published : Feb 16, 2020, 8:11 PM IST

Updated : Mar 1, 2020, 1:31 PM IST

65వ ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం శనివారం గువహటిలో జరిగింది. అయితే ఈ వేడుకలో 'గల్లీబాయ్‌' చిత్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. అయితే బాలీవుడ్‌లోని మూవీ మాఫియా గురించి కంగన చాలా సందర్భాల్లో స్పందించిందని.. అందుకే తనకు, తాను నటించిన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదని రంగోలీ ఆరోపించింది.

ఆలియా భట్‌, అనన్య పాండే కంటే బాగా నటించే చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలో ఉన్నారంటూ రంగోలీ ట్వీట్లు పెట్టింది.

"గల్లీబాయ్‌ సినిమాలో ఆలియాభట్‌ నటన మధ్యస్తంగా ఉంటుంది. ప్రధాన పాత్రలో ఉన్న ఆలియాకు నటించడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఒక సహాయ నటిలాగానే కనిపించింది. మరి అలాంటి ఆమెకు ఫిలింఫేర్‌ అవార్డు ఎలా ఇచ్చారు. ఉత్తమ సహాయ నటిగా అనన్యపాండే కంటే 'పటాఖా' సినిమాలో నటించిన రాధిక మదన్‌కు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఆ సినిమాలో రాధిక మదన్‌ నటన అద్భుతంగా ఉంటుంది. రాధికకు అవార్డు ఇస్తే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించినట్లు ఉండేది. 'మణికర్ణిక' సినిమాలో నటించిన అంకిత.. ఝలకరిభాయ్ పాత్రలో నటించి ఎంతోగానో మెప్పించింది. కాబట్టి అంకితను ఉత్తమ సహాయనటిగా గుర్తించి ఉండాల్సింది."

-రంగోలీ, కంగనా సోదరి

ఈ ఏడాది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'గల్లీబాయ్'​ నిలిచింది. మొత్తం ఈ సినిమా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డు కోసం చిచోరే, మిషన్ మంగల్, ఉరి, వార్ పోటీపడ్డాయి. ఉత్తమ నటీనటుల విభాగంలో రణ్​వీర్​ సింగ్​, ఆలియా పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

Last Updated : Mar 1, 2020, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details