తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహా సముద్రం'లోకి 'జాను' జంట..! - శర్వానంద్, సమంత మహాసముద్రం

'జాను' చిత్రంలో కలిసి నటిస్తున్నారు శర్వానంద్, సమంత. దీని తర్వాత మరో సినిమాలోను వీరిద్దరు హీరోహీరోయిన్లుగా చేయనున్నట్లు సమాచారం.

aanu
aanu

By

Published : Jan 10, 2020, 5:08 PM IST

'జాను'.. హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమకథతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శర్వానంద్, సమంత. తమిళంలో విజయం అందుకున్న '96' చిత్రానికి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. దీని తర్వాత మరోసారి ఈ జంట కలిసి నటించబోతుందంటూ సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

'ఆర్‌ఎక్స్‌ 100" చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి గతంలో 'మహా సముద్రం' అనే క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే రవితేజ, నాగ చైతన్య, కార్తికేయ, విశ్వక్‌సేన్‌ పేర్లు వినిపించినప్పటికీ స్పష్టత లేదు. తాజాగా శర్వానంద్‌.. అజయ్‌ భూపతి దర్శకత్వంలో నటిస్తున్నాడని టాలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని, దాదాపు ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో కథానాయకుడి కోసం అన్వేషిస్తుందట చిత్ర బృందం.

ఈ చిత్రంలోనే శర్వానంద్‌ సరసన సమంత కనిపించబోతుందని అంటున్నాయి చిత్ర సీమ వర్గాలు. ఇప్పటికే విడుదలైన 'జాను' ఫస్ట్‌లుక్, టీజర్‌తో అంచనాలు పెంచుతున్నారు శర్వా, సామ్‌. ఇప్పుడు మరో చిత్రంలో కలిసి నటించబోతున్నారనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

ఇవీ చూడండి.. కత్రినా-విక్కీలు డేటింగ్‌లో ఉన్నారా..?

ABOUT THE AUTHOR

...view details