బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నాడు. ఇప్పటికే 'పీఎం కేర్స్'కు రూ.25 కోట్ల విరాళమిచ్చిన అక్కీ.. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)కు రూ.3 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మొత్తాన్ని పీపీఈ కిట్లు, మాస్క్లు, కరోనా టెస్టింగ్ కిట్ల కోసం ఉపయోగించాలని సూచించాడు. ఈ విషయాన్ని బీఎంసీ జాయింట్ మున్సిపల్ కమీషనర్ అశుతోష్ ధ్రువీకరించారు.
అప్పుడు రూ.25 కోట్లు.. ఇప్పుడు మరో రూ.3 కోట్లు
ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ముంబయి మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం రూ.3 కోట్లు విరాళమిచ్చాడు. ఈ మొత్తాన్ని పీపీఈ కిట్లు, మాస్క్లు, కరోనా టెస్టింగ్ కిట్లు కోసం వినియోగించనున్నారు.
హీరో అక్షయ్ కుమార్
"అక్షయ్ కుమార్.. కొన్నిరోజుల నుంచి బీఎంసీ కమీషనర్తో టచ్లో ఉన్నారు. అతడు విరాళమిచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. వాటిని పీపీఈ కిట్లు, మాస్క్లు, టెస్టింగ్ కిట్లు కోసం వినియోగిస్తాం" -అశుతోష్ సలీల్, బీఎంసీ జాయింట్ మున్సిపల్ కమీషనర్