బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. హీరో అర్జున్ కపూర్ ఆదివారం పాజిటివ్‌గా తేలగా, అదే రోజు నటి మలైకా అరోరాకు వైరస్ సోకినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా వెల్లడించింది. అర్జున్-మలైకా గురించి ఇప్పటికే రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ప్రస్తుతం సహాజీవనం కూడా చేస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు.
ఒకరోజు వ్యవధిలో మలైకా-అర్జున్‌కు కరోనా - అర్జున్ కపూర్‌కు కరోనా
నటి మలైకా అరోరాకు కరోనా సోకినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా వెల్లడించింది. అయితే అర్జున్ కపూర్ పాజిటివ్ వచ్చిన తర్వాత రోజే ఈమెకు వైరస్ వచ్చినట్లు తేలడంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
ఒకేరోజు వ్యవధిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాకు కరోనా
తనకు కరోనా సోకినట్లు హీరో అర్జున్ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదివారం స్వయంగా వెల్లడించాడు. తనలో ఎలాంటి లక్షణాలు లేవని, వైద్యుల సూచన మేరకు 14 రోజులు నిర్బంధంలో ఉండనున్నట్లు చెప్పాడు.
ప్రస్తుతం 'భూత్ పోలీస్' అనే చిత్రంలో నటిస్తున్నారు అర్జున్ కపూర్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మలైకా 'ఇండియాస్ బెస్ట్ డాన్సర్' చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించనుంది.
Last Updated : Sep 7, 2020, 1:18 PM IST