తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆమిర్​ స్థానంలో హృతిక్​ వస్తున్నాడా? - saif ali khan latest updates

'విక్రమ్​ వేదా' హిందీ రీమేక్​ నుంచి బాలీవుడ్​ నటుడు ఆమిర్​ ఖాన్​ తప్పుకోగా.. ప్రత్యామ్నాయ నటుడి కోసం చూస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో హృతిక్​ రోషన్​తో సంప్రదింపులు జరపుతున్నట్లు తెలుస్తోంది.

After Aamir's exit, Hrithik steps in for Vikram Vedha remake?
ఆమీర్​ స్థానంలో హృతిక్​ వస్తున్నాడా?

By

Published : Dec 25, 2020, 9:19 PM IST

'విక్రమ్​ వేదా' హిందీ రీమేక్​లో బాలీవుడ్​ నటుడు హృతిక్ రోషన్​​ నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవలే.. ఈ సినిమా నుంచి ఆమిర్​ ఖాన్​ తప్పుకోగా.. ఈ చిత్ర నిర్మాతలు హృతిక్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తమిళంలో ఘన విజయం సాధించిన 'విక్రమ్​ వేదా'ను సైఫ్​ అలీ ఖాన్​, ఆమిర్​​తో రీమేక్​ చేయాలనుకున్నారు. అయితే.. హిందీ వెర్షన్​లో ఈ సినిమా స్క్రీన్​ప్లే నచ్చకపోవడం వల్ల ఆమిర్​ ఇటీవల ఈ సినిమాను వదులుకున్నారు. ఆమిర్​ ఈ సినిమాను అంగీకరించకముందు మొదట ఈ చిత్ర దర్శక నిర్మాతలు హృతిక్​నే కలిసినట్లు సమాచారం. ఇప్పుడు ఆమిర్​ ప్రాజెక్టును నుంచి తప్పుకోవడం వల్ల మరోసారి హృతిక్​ వద్దకే దర్శకనిర్మాతలు వెళ్లినట్లు తెలుస్తోంది.

మాతృకలో ఆర్​.మాధవన్ పోషించిన పోలీసు 'విక్రమ్'​ పాత్రలో సైఫ్​ అలీ ఖాన్​ కనిపించనున్నారు.

ఇదీ చూడండి:'విక్రమ్​ వేదా' రీమేక్​ నుంచి ఆమిర్​ తప్పుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details