'విక్రమ్‌వేదా' హిందీ రీమేక్‌కు కష్టాలు తప్పట్లేదు. అందులో నటించాల్సిన హృతిక్ రోషన్.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
ఇంతకీ ఏమైంది?
'విక్రమ్‌వేదా' హిందీ రీమేక్‌కు కష్టాలు తప్పట్లేదు. అందులో నటించాల్సిన హృతిక్ రోషన్.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
ఇంతకీ ఏమైంది?
'విక్రమ్ వేదా' హిందీ రీమేక్‌ను తొలుత సైఫ్-ఆమిర్‌లతో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆమిర్ తప్పుకోగా, ఆయన స్థానంలో హృతిక్ వేదా పాత్ర పోషించేందుకు తీసుకున్నారు. అయితే ఇప్పుడు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల దీని నుంచి హృతిక్ తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో మాధవన్-విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్-గాయత్రి.. హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల రీమేక్‌కు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికీ పరిష్కారమవుతాయో చూడాలి?