తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పూజా హెగ్డే.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అక్కడ! - entertainment news

ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత తమిళంలో నటించే అవకాశం దక్కించుకుందని సమాచారం.

పూజా హెగ్డే.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అక్కడ!
హీరోయిన్ పూజా హెగ్డే

By

Published : Mar 8, 2020, 1:30 PM IST

హీరోయిన్ పూజా హెగ్డే.. ఇప్పుడు వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడుతోంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ కొట్టేసినట్లు సమాచారం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

2012లో వచ్చిన 'ముగమూడి'తో కోలీవుడ్​కు పరిచయమైంది పూజా. ఆ తర్వాత అక్కడ మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హీరో విజయ్‌తో నటించనుందని టాక్. ప్రస్తుతం ఇతడు 'మాస్టర్‌' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. పూర్తయిన వెంటనే 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నాడు. ఇప్పుడీ చిత్రం కోసమే విజయ్‌కు జోడీగా పూజాను తీసుకోబోతున్నారట.

హీరోయిన్ పూజా హెగ్డే

ఇటీవలే ఆమెతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపారని, సుధా చెప్పిన కథ ఆమెకు నచ్చడం వల్ల పూజా నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details