తెలంగాణ

telangana

ETV Bharat / sitara

13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న విజయశాంతి - మహేశ్​బాబు

'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్​కు హాజరైంది నటి విజయశాంతి. ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని చెపుతూ మేకప్​ వేసుకుంటున్న ఫొటోను ట్వీట్​ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

13 ఏళ్ల తర్వాత విజయశాంతి ముఖానికి మేకప్​

By

Published : Aug 12, 2019, 7:30 PM IST

Updated : Sep 26, 2019, 7:04 PM IST

టాలీవుడ్‌ ప్రముఖ నటి విజయశాంతి... 13ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. ఆమె రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్​స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రాములమ్మ కనిపించబోతోంది. ఆమె షూటింగ్​లో పాల్గొన్న ఫొటోను చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్విట్టర్​లో పంచుకున్నాడు.

‘ఇది విజయశాంతికి మేకప్‌ వేసుకునే సమయం. 13 ఏళ్లు గడిచినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. అదే పద్ధతి, అదే వ్యక్తిత్వం’. -ట్విట్టర్​లో అనిల్ రావిపూడి, దర్శకుడు

ఈ సినిమాలో రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెట్​లో మహేశ్​బాబుతో దర్శకుడు అనిల్ రావిపూడి

ఇది చదవండి: ఇస్మార్ట్​ దర్శకుడితో రౌడీ.. అంతా రెడీ

Last Updated : Sep 26, 2019, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details