తెలంగాణ

telangana

ETV Bharat / sitara

12 ఏళ్ల తర్వాత రవితేజ సరసన ఆ హీరోయిన్​?

'వీర' ఫేం రమేశ్​ వర్మ దర్శకత్వంలో మాస్​ హీరో రవితేజ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

after 12years trisha and raviteja combination movie coming this year...
12 ఏళ్ల తర్వాత రవితేజ సరసన ఆ హీరోయిన్​?

By

Published : Mar 24, 2020, 5:38 PM IST

మాస్​ మహారాజ రవితేజ, అందాల తార త్రిష జంటగా మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 'వీర', 'రాక్షసుడు' ఫేం రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. గతంలో రవితేజ, త్రిష కలయికలో వచ్చిన 'కృష్ణ' ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

త్రిష

ఇప్పటికే ఈ చిత్రానికి హీరోగా రవితేజను ఖరారు చేయగా.. కథానాయికగా త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ మూవీలో ఇద్దరు కథానాయికల పాత్రలు ఉండగా.. మరో నాయికగా నిధి అగర్వాల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తూ.. మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తానంటూ తెలిపింది. మరి ఆ సినిమా ఇదేనా అనేది తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details