తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పదేళ్ల తర్వాత మహేశ్​ సినిమాకు మణిశర్మ! - tollywood news

మహేశ్​బాబు-వంశీ పైడిపల్లి ప్రాజెక్టు కోసం సంగీత దర్శకుడు మణిశర్మను తీసుకోనున్నారని సమాచారం. ఈ విషయం నిజమో? కాదో? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

పదేళ్ల తర్వాత మహేశ్​ సినిమాకు మణిశర్మ!
మహేశ్​బాబు-మణిశర్మ

By

Published : Jan 3, 2020, 7:01 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు-మణిశర్మలది హిట్​ కాంబో. వీరిద్దరూ కలిసి పనిచేసిన చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టించాయి. 2010లో వచ్చిన 'ఖలేజా' తర్వాత మహేశ్​తో పనిచేయలేదు మణిశర్మ. ఆ తర్వాత.. ఈ ఇద్దరూ ఎప్పుడూ కలిసి పనిచేస్తారా? అని అభిమానులు ఎదురుచూశారు. త్వరలో ఈ విషయం నిజం కాబోతుందని సమాచారం. మహేశ్​ తర్వాత సినిమాకు ఈ సంగీత దర్శకుడు స్వరాలు అందించనున్నాడట.

'మహర్షి' వంటి హిట్​ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని అప్పుడే ప్రకటించాడు మహేశ్​. ఈ ప్రాజెక్టు కోసమే మణిశర్మను సంప్రదించిందట చిత్రబృందం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ఇతడు #చిరు152, రామ్ 'రెడ్', విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ సినిమాలకు పనిచేస్తున్నాడు.

మహేశ్​ 'సరిలేరు నీకెవ్వరు'.. సంక్రాంతి కానుకగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆర్మీ అధికారిగా కనిపించనున్నాడీ కథానాయకుడు.

ఇది చదవండి: మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' విడుదల తేదీ మార్పు!

ABOUT THE AUTHOR

...view details