నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రూలర్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ వీడియో ఒకటి విడుదలై అలరిస్తోంది. 'అడుగడుగో యాక్షన్ హీరో' అంటూ సాగే పాట టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 14న సినిమా ముందస్తు విడుదల వేడుకను విశాఖపట్నం నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు చిత్రబృంందం ప్రకటించింది.
రొమాంటిక్‌గా కనిపిస్తున్న 'రూలర్' బాలయ్య - అడుగడుగున యాక్షన్ హీరో
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'రూలర్' నుంచి 'అడుగడుగో యాక్షన్ హీరో' పాట టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో బాలయ్య రొమాంటిక్‌గా కనిపిస్తున్నాడు.

బాలయ్య
రొమాంటిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్, స్టిల్స్ విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో నాయికలుగా సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది.
ఇవీ చూడండి.. ఫస్ట్‌లుక్: వేశ్యగా టబు.. ఇషాన్‌తో రొమాన్స్