అడివి శేష్ కథానాయకుడిగా నటించిన 'ఎవరు' ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. భారత్‌తో పాటూ ఇతర దేశాల్లోనూ అలరిస్తోంది. ఈ చిత్రం చూసిన రీనా అనే జపాన్ అమ్మాయి శేష్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడీ హీరో.
"నన్ను కలవడానికి రీనా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చింది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయా.. ఇలాంటి వ్యక్తుల అభిమానమే నన్ను ముందుకు నడిపిస్తుంది." -ట్విట్టర్లో అడివి శేష్