26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తుండగా, టాలీవుడ్ నటుడు అడివి శేష్ టైటిల్ రోల్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈరోజు విజయ్ దివస్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
గన్స్‌తో వచ్చేసిన అడివి శేష్, విశాల్ - Vishal Enemy
మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మేజర్'. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. అలాగే విశాల్, ఆర్య నటిస్తోన్న 'ఎనిమీ' చిత్రం నుంచి విశాల్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
గన్స్‌తో వచ్చేసిన శేష్, విశాల్
కోలీవుడ్ హీరోలు విశాల్, ఆర్య కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను 'ఎనిమీ'గా ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాలో విశాల్ లుక్‌ను విడుదల చేశారు.
Last Updated : Dec 17, 2020, 12:00 PM IST