తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మేజర్​' కోసం అడివి శేష్​ నయా అవతారం - mahesh babu

హీరో అడివి శేష్.. 'మేజర్'లో​ని తన పాత్ర కోసం 10 కిలోల మేర బరువు తగ్గాలని నిర్ణయిం తీసుకున్నాడు. 26/11 దాడుల కథాంశంతో రూపొందుతోంది చిత్రం.

హీరో అడివి శేష్

By

Published : Aug 25, 2019, 5:10 PM IST

Updated : Sep 28, 2019, 5:34 AM IST

ఇటీవలే 'ఎవరు'తో హిట్ కొట్టాడు నటుడు అడివి శేష్. ఓ వైపు సహాయపాత్రలు చేస్తూనే కథానాయకుడిగానూ మెప్పిస్తున్నాడు. అయితే తన తర్వాతి చిత్రం 'మేజర్'​లో విభిన్నమైన లుక్​లో అలరించనున్నాడు. అందులో సైనిక అధికారిగా కనిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. మూడు నెలల్లో 10 కిలోల బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నాడు శేష్.

మేజర్​ సినిమా పోస్టర్

ముంబయిలో జరిగిన 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తీస్తున్నారు. శేష్​తో 'గూఢచారి'ని తెరకెక్కించిన శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. హీరో మహేశ్​బాబు... సోనీ పిక్చర్స్​తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.​

ఇది చదవండి: 'మన్మథుడు-2' దర్శకుడితో నేచురల్​ స్టార్​!

Last Updated : Sep 28, 2019, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details