Adivi Sesh Major: 26/11 ముంబయి దాడుల ఆధారంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ సినిమాలోని 'హృదయమా' అనే పాటను జనవరి 7న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.
సంక్రాతికే రానున్న 'సామాన్యుడు'
కథానాయకుడు విశాల్ నటిస్తూ నిర్మించిన ద్విభాషా చిత్రం 'సామాన్యుడు'. శరవణణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న సామాన్యుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని భావించారు. కానీ వరుస సెలవులు కలిసిరావడం వల్ల వారం ముందుగానే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
డబ్బు, పలుకబడితో సామాన్యులపై అధికారం చెలాయించాలనుకునే ఓ వర్గాన్ని సామాన్యుడు ఎలా ఎదిరించాడనే కథాంశంతో విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ సరసన డింపుల్ హయాతి కథానాయికగా నటించింది.
పాటతో 'శేఖర్'..
రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్'. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి 'లవ్ గంటే' అనే పాటను జనవరి 5న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు.
మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రాజశేఖర్ వయసు పైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించారు. అను సితార, మస్కన్ సేతి హీరోయిన్లు.
కొత్త పాటతో..