తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్టికల్ 15' రీమేక్​లో అడివి శేష్! - అడివి శేష్ సినిమాలు

విభిన్న చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న నటుడు అడివి శేష్.. 'ఆర్టికల్ 15' రీమేక్​లోనూ నటించనున్నాడట. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

'ఆర్టికల్ 15' రీమేక్​లో అడివి శేష్!
అడివి శేష్

By

Published : Aug 10, 2020, 9:21 AM IST

బాలీవుడ్​ హిట్​ సినిమా 'ఆర్టికల్ 15'.. తెలుగు రీమేక్​ గురించి గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ నిర్మాత సురేశ్​బాబు.. ఈ చిత్ర హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత విక్టరీ వెంకటేశ్​తో తీయాలని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది.

పరువు హత్యలకు సంబంధించిన కథతో ఈ సినిమా తీశారు. బాలీవుడ్​లో చిన్న చిత్రంగానే వచ్చినా పెద్ద హిట్​ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని రీమేక్​ను అడివి శేష్ హీరోగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అన్ని కుదిరితే త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. 'మేజర్', 'గూఢచారి 2' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు శేష్. వీటి షూటింగ్​లు పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టులో నటించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details