టాలీవుడ్ యువనటుడు అడివిశేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఎవరు'. ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నాడీ హీరో. ఇది విభిన్నంగా ఉంటూ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని శేష్ కనిపిస్తుండగా, తన ఎడమ కంటి భాగం దగ్గర ఉన్న అద్దంలో రెజీనా ముఖం కనిపించింది. ఇందులో అవినీతి పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవ్‌గా కనిపించనున్నాడీ కథానాయకుడు.
"నిజానికి ముఖం ఒకటే ఉంటుంది. అబద్దానికి ఎన్నో ఉంటాయి. సమాధానాలకు ప్రశ్నలు ఈ ఆగస్టులో దొరుకుతాయి" -ట్విట్టర్లో అడివి శేష్