'క్షణం', 'గూఢచారి', 'ఎవరు'... ఇలా వరుస థ్రిల్లర్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు అడివి శేష్. సహాయ నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి విలన్‌గా మారి ఆ తర్వాత కథానాయకుడిగా చిత్రసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన 'ఎవరు' సక్సెస్ మీట్లో మాట్లాడిన శేష్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎలాంటి కష్టాల్ని అనుభవించాడో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు.
"నేను కాలిఫోర్నియా నుంచి వచ్చినా కృష్ణానగర్ కష్టాలు అనుభవించా. నిజానికి అమెరికా వెళ్లే సమయానికి మా దగ్గర భోజనం చేసేందుకు డబ్బులు లేవు. మా చదువులకు నాన్న సంపాదన సరిపోయేది కాదు. మంచి దుస్తులు కొనుక్కోవాలన్నా కష్టంగా ఉండేది. నాన్న డాక్టర్ అయినా కొన్నాళ్ల పాటు ఓ రెస్టారెంట్లో మేనేజర్‌గా చేశారు. అమ్మ వెయిట్రెస్‌గా పనిచేసింది" -అడివి శేష్, నటుడు