టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. భణిత సంధు హీరోయిన్గా నటిస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దర్శకుడు బాలా తెరకెక్కించాడు. ఔట్పుట్ అనుకున్న విధంగా లేకపోవడం వల్ల అర్ధంతరంగా ఆపేశారు. మాతృకను తెరకెక్కించిన సందీప్ వంగా శిష్యుడు గిరీసయ్యకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబరు 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.