తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు' - Aashiqui 2

ఈ ఏడాదిలో తను పెళ్లి చేసుకుంటాననే వార్తలు అబద్ధమని అన్నాడు హీరో ఆదిత్యరాయ్ కపూర్. మోడల్ దివా, తనకు స్నేహితురాలు మాత్రమేనని చెప్పాడు.

'ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు'
హీరో ఆదిత్యరాయ్ కపూర్

By

Published : Jan 25, 2020, 10:32 AM IST

Updated : Feb 18, 2020, 8:23 AM IST

ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు బాలీవుడ్‌ హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌. 'ఆషికీ-2', 'ఓకే జాను' వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాదిలో ఆదిత్య.. తన స్నేహితురాలు, సూపర్‌ మోడల్‌ దివా ధావన్‌ను పెళ్లి చేసుకోనున్నాడంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈ కథానాయకుడు ఓ ఆంగ్ల పత్రికకు చెందిన విలేకర్లతో సరదాగా ముచ్చటించాడు. ఇందులో భాగంగా తన పెళ్లి గురించి స్పందించాడు.

"దివా ధావన్‌, నేను మంచి స్నేహితులం. మా ఇద్దరిది ఎన్నో సంవత్సరాల స్నేహం. ఒకసారి కలిసి డిన్నర్‌కు వెళ్లి రావడం వల్ల చాలా మంది మేం ప్రేమలో ఉన్నామని మాట్లాడుకున్నారు. అలాగే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోబోతున్నామని అనుకున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. చాలా సమయం ఉంది" -ఆదిత్య రాయ్ కపూర్, హీరో

దివా ధావన్‌.. గతంలో ఓ అబ్బాయిని ముద్దుపెట్టుకుంటూ ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. 'ఇట్స్‌ ఫ్రైడే.. ఐయామ్‌ ఇన్‌ లవ్‌' అంటూ రాసుకొచ్చింది. చాలామంది నెటిజన్లు ఆ ఫొటోలో ఉన్నది ఆదిత్యనే అంటూ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం 'మలంగ్' సినిమాలో నటిస్తున్నాడు ఆదిత్య. దిశాపటానీ హీరోయిన్. మోహిత్ సూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలంగ్ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్-దిశా పటానీ
Last Updated : Feb 18, 2020, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details