తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పదేళ్ల సహజీవనం.. ఇప్పుడు పెళ్లి - గాయకుడు ఉదిత్​ నారాయణ్​

ప్రముఖ గాయకుడు ఉదిత్​ నారాయణ్​.. డిసెంబరు 1వ తేదీన జరిగిన తన కుమారుడి ప్రేమపెళ్లి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన కొడుకు ఆదిత్యా నారాయణ్​, కోడలు, నటి శ్వేతా అగర్వాల్​ దాదాపు పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించారు.

udit narayan
ఉదిత్​ నారాయణ్​

By

Published : Dec 6, 2020, 2:20 PM IST

Updated : Dec 6, 2020, 2:41 PM IST

'అందమైన ప్రేమరాణి', 'అందాల ఆడబొమ్మ', 'కీరవాణి రాగంలో', 'పసిఫిక్‌లో దూకేయ్​మంటే', 'అమ్మాయే సన్నగా'.. ఇలా ఎన్నో మధురమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌. తాజాగా.. ఇటీవల జరిగిన తన కుమారుడు ప్రేమపెళ్లిపై ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆయన చెప్పారు. తన కొడుకు కోడలు దాదాపు పదేళ్ల నుంచి సహజీవనం చేస్తునట్లు వెల్లడించారు.

ఉదిత్​ నారాయణ్​ కుటుంబం

"నాకు ఆదిత్య ఒక్కడే సంతానం. వాడి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నా. కొవిడ్‌-19 కారణంగా భారీ వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా వైరస్‌ పరిస్థితులు కొంచెం చక్కబడే వరకూ నా కొడుకు పెళ్లి వాయిదా వేయాలనుకున్నా. కాకపోతే ఆదిత్య-శ్వేతా, ఆమె తల్లిదండ్రులు.. ఇప్పుడు పెళ్లి జరిగితే బాగుంటుందని భావించారు. మా కొడుకు ఆదిత్య, శ్వేతా సింగ్‌ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఇప్పుడు తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. శ్వేతా అగర్వాల్‌ ఒద్దికైన అమ్మాయి. చాలా తక్కువగా మాట్లాడుతుంది. ఆదిత్య కోసం మేం ఎన్నో సంబంధాలు చూశాం. కానీ ఓరోజు ఆదిత్య మా దగ్గరికీ వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మొదట మేం కొంచెం షాక్‌ అయ్యాం. ఎన్నో ఏళ్లుగా స్నేహితులైన వాళ్లిద్దరూ ఇప్పుడు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది"

-ఉదిత్‌, గాయకుడు.

ఉదిత్‌ నారాయణ్.. కుమారుడు ఆదిత్యా నారాయణ్‌ డిసెంబర్​ 1వ తేదీన వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నటి శ్వేతా అగర్వాల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ముంబయిలోని ఇస్కాన్‌ మందిరంలో వీరి వివాహ వేడుక జరిగింది.

ఆదిత్యా నారాయణ్,​ శ్వేతా అగర్వాల్​
ఆదిత్యా నారాయణ్​, శ్వేతా అగర్వాల్​

ఇదీ చూడండి :వీళ్లు హీరోయిన్లే కాదు.. రచయిత్రులు కూడా!

Last Updated : Dec 6, 2020, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details