తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూ.400 కోట్ల డీల్​కు స్టార్​ ప్రొడ్యూసర్​ నో- థియేటర్​పైనే ఆశలు

ఓటీటీ నుంచి అదిరిపోయే ఆఫర్ వస్తే ఏ నిర్మాత అయినా మరో ఆలోచన లేకుండా సినిమాను ఇచ్చేసేందుకు చూస్తారు. కానీ ఓ స్టార్ ప్రొడ్యూసర్​ మాత్రం వందల కోట్ల డీల్​ను కాదనుకున్నారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? దీని వెనుకున్న సంగతేంటి?

cinema
సినిమా

By

Published : Sep 24, 2021, 4:04 PM IST

కరోనా లాక్​డౌన్​ వల్ల ఓటీటీ ప్లాట్​ఫామ్​ల క్రేజ్​తో పాటు జోరు కూడా పెరిగింది. తమ సినిమాలకు వస్తున్న ఆఫర్లను వదులుకోలేక వీటిలోనే రిలీజ్​ చేసేందుకు పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. కానీ యశ్​​రాజ్​ ఫిల్మ్స్​((yash raj films new movie) అధినేత ఆదిత్య చోప్రా మాత్రం తాను నిర్మించిన పలు చిత్రాలకు వచ్చిన భారీ ఆఫర్​ను వదులుకున్నారట!

యశ్​​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తున్న చిత్రాల్లో ప్రస్తుతం సైఫ్​ అలీఖాన్​ 'బంటీ ఔర్​ బబ్లీ 2'(saif ali khan bunty aur babli 2), రణ్​బీర్​ కపూర్​ 'షంషేరా'(shamshera movie trailer), అక్షయ్​కుమార్​ 'పృథ్వీరాజ్'(prithviraj akshay kumar movie trailer )​, రణ్​వీర్​ సింగ్​ 'జయేష్​భాయ్ జోర్దార్'(ranveer singh jayeshbhai)​ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు అన్నింటినీ కలిపి రూ.400కోట్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్​ ప్రైమ్​ వీడియో ఆసక్తి కనబరిచిందని యశ్​రాజ్​ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ఆదిత్యతో చర్చలు కూడా జరిపిందని కానీ ఆయన ఈ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలానే ఆయా సినిమా విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

'పృథ్వీరాజ్'​(akshay kumar prithviraj movie poster).. ఈ సినిమాకు 'మొహల్లా ఆసీ' ఫేమ్​ చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్​కుమార్​ ప్రధాన పాత్ర పోషించారు.

'బంటీ ఔర్​ బబ్లీ 2'(bunty aur babli 2 saif ali khan).. ఈ చిత్రానికి వరుణ్​ వి. శర్మ దర్శకత్వం వహించగా.. సైఫ్​ అలీ ఖాన్​, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్​ చతుర్వేది, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

'జయేష్​భాయ్ జోర్దార్​'(jayeshbhai jordaar film).. నూతన దర్శకుడు దివ్యాంగ్​ టక్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ నేపథ్యంలో రూపొందిందీ సినిమా. రణ్​వీర్​ సింగ్​, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.

రణ్​​బీర్​ కపూర్​, సంజయ్​ దత్​, వాణీకపూర్​ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'షంషేరా'(shamshera movie story). పీరియాడిక్​ డ్రామాగా రూపొందిన ఈ మూవీని కరణ్​ మల్హోత్రా తెరకెక్కించారు.

ఇదీ చూడండి: Maro Prasthanam Review: 'మరో ప్రస్థానం'తో తనీశ్ మెప్పించారా?

ABOUT THE AUTHOR

...view details