తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Aditi rao hydari: 'హైదరాబాద్​ బిర్యానీ అంటే చాలా ఇష్టం' - aditi rao hydari mahasamudram

హీరోయిన్ అదితీ రావు హైదరీ.. తన ఆహార అలవాట్లు గురించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. హైదరాబాద్​ బిర్యానీ అంటే ఇష్టమని చెప్పింది. బాగా తిని, వ్యాయామం చేస్తానని తెలిపింది.

aditi rao hydari about her food habits
అదితీ రావు హైదరీ

By

Published : Jun 10, 2021, 7:46 AM IST

'నేను బాగా తింటా.. అలాగే వ్యాయామం చేస్తా' అంటోంది హీరోయిన్ అదితి రావ్ హైదరీ. ఇటీవలే ఓటీటీ వేదిక నెట్​ఫ్లిక్స్ ద్వారా 'సర్దార్ కా గ్రాండ్ సన్'తో సందడి చేసిన ఈ అమ్మడు.. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమని చెప్పింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

హీరోయిన్ అదితీ రావు హైదరీ

"దిల్లీలో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అదే హైదరాబాద్​కు వెళితే ఇంట్లో వండిన బిర్యానీని ఇష్టంగా తింటాను. తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో తయారు చేసిన అన్ని రకాల వంటలను ఆస్వాదిస్తాను. రసం, సాంబర్, రైస్, బిర్యానీ, ఆవకాయ్.. ఇలా అన్నీ ఉంటాయి. ముంబయి వచ్చిన కొత్తలో మంచి ఫుడ్ కోసం ఎక్కడెక్కడో వంటలు బాగా తిని... తగిన వ్యాయామం చేస్తే చాలు ఆరోగ్యంగా ఉండొచ్చు" అని చెప్పుకొచ్చింది. అదితి తెలుగులో 'మహాసముద్రం'లో నటిస్తోంది.

ఇది చదవండి:'బాలీవుడ్​లో అందువల్లే అవకాశాలు కోల్పోయా'

ABOUT THE AUTHOR

...view details