తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ నెలాఖరున సెట్స్​పైకి 'ఆదిపురుష్' - ఆదిపురుష్ అప్​డేట్స్

ప్రభాస్ హీరోగా బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్​లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమా షూటింగ్​ ఎప్పుడు మొదలవబోతుందో వెల్లడించారు దర్శకుడు.

Adipurush director Om Raut on negativity around the film even before it's made
ఈ నెలాఖరున సెట్స్​పైకి 'ఆదిపురుష్'

By

Published : Jan 6, 2021, 3:21 PM IST

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని అప్​డేట్స్ ఇచ్చారు దర్శకుడు రౌత్.

ఈ సినిమా షూటింగ్​ను ఈ నెల చివర్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఓం రౌత్. అలాగే ఇందులో సీత పాత్ర చేయబోయే హీరోయిన్ ఎవరనేది కొన్ని రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. కృతి సనన్ ఇందులో సీత పాత్ర చేస్తోందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమె ఇందుకోసం వర్క్ షాప్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో తెరకెక్కుతోంది. భూషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details