తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Adipurush movie:'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి.. మరో పదినెలలు మాత్రం - ప్రభాస్ న్యూ మూవీ

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' షూటింగ్ మొత్తం పూర్తయింది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

adipurush movie
ఆదిపురుష్ మూవీ

By

Published : Nov 10, 2021, 4:05 PM IST

డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' మొత్తం షూటింగ్​ పూర్తయింది. అయితే మోషన్​ క్యాప్చర్​ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్​ మరో 10 నెలల పాటు జరగనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది.

ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తి

రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు. కృతిసనన్ సీత, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్.. ప్రతినాయకుడు రావణాసురుడిగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్​-రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ప్రభాస్​ నటించిన రొమాంటిక్ సినిమా 'రాధేశ్యామ్'.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ప్రశాంత్​ నీల్ దర్శకత్వంలో 'సలార్' చేస్తున్నారు. ఇది కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది.

ఆదిపురుష్ మూవీ పోస్టర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details