రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రబృందం నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ప్రధాన భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ ఎంపికవ్వగా.. సీత పాత్రకు కృతిసనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
2022లో ప్రేక్షకుల ముందుకు 'ఆదిపురుష్' - ప్రభాస్ ఓమ్ రౌత్ వార్తలు
రెబల్‌స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ఆదిపురుష్ నుంచి మరో అప్డేట్ను చిత్రబృందం విడుదల చేసింది. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణసంస్థ గురువారం ప్రకటించింది.
ఆదిపురుష్
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. భూషణ్‌కుమార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లో విడుదల చేయనున్నారు.