తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిపురుష్'​ను తెరకెక్కించడం చాలా కష్టం: ఓం ​రౌత్

'ఆదిపురుష్'​ సినిమాను తెరకెక్కించడం ఎన్నో సవాళ్లతో కూడిన పని అని అన్నారు దర్శకుడు ఓం​రౌత్​. అందుకు గల కారణాన్ని వివరించారు. ఈ చిత్రాన్ని చూడటానికి భారీ ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

adipurush
ఆదిపురుష్​

By

Published : Feb 24, 2021, 10:26 AM IST

హీరో ప్రభాస్​తో 'ఆదిపురుష్'​ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం​ రౌత్. ​ఇటీవల సెట్స్​పైకి వెళ్లిందీ చిత్రం. తాజాగా దీనిపై స్పందించిన ఆయన.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అన్నారు.

"'ఆదిపురుష్'​ను తెరకెక్కించడం చాలా కష్టం. ఎన్నో సవాళ్లతో కూడిన పని. ఈ సినిమా కథాంశం(రామాయణం) నాతో సహ ప్రపంచంలోని 50కోట్ల మందికి ఎంతో ముఖ్యం. చూసిన ప్రతిసారి.. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పొందేలా ఈ చిత్రాన్ని రూపొందించాలి. దీని కోసం చాలా కష్టపడాలి. థియేటర్లోనే ఈ సినిమా విడుదలవుతుంది. దీన్ని చూడటానికి భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివస్తారని భావిస్తున్నాను."

-ఓంరౌత్​, బాలీవుడ్​ దర్శకుడు.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్​, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ఓం రౌత్​ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సిరీస్​ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీచూడండి: రాముడిగా ప్రభాస్​ను అందుకే ఎంచుకున్నా

ABOUT THE AUTHOR

...view details