'హార్ట్ ఎటాక్' చిత్రంతో కుర్రకారు గుండెల్ని ఎటాక్ చేసింది అదా శర్మ. కానీ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే కొంత విరామం తర్వాత మళ్లీ టాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
అదా శర్మ కొత్త సినిమా టైటిల్ '?' - అదా శర్మ వార్తలు
ముద్దుగుమ్మ అదాశర్మ కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. '?' (క్వశ్చన్ మార్క్) టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
![అదా శర్మ కొత్త సినిమా టైటిల్ '?' అదాశర్మ కొత్త సినిమా టైటిల్ '?'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8589433-160-8589433-1598602529995.jpg)
అదాశర్మ కొత్త సినిమా టైటిల్ '?'
ఈ చిత్రానికి '?' (క్వశ్చన్ మార్క్) అనే వినూత్న టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విప్ర దర్శకత్వం వహిస్తుండగా.. రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు.
Last Updated : Aug 28, 2020, 2:09 PM IST